- Advertisement -
తిరుమలలో శనివారం రాత్రి శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
ఈ పౌర్ణమి గరుడ సేవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక గరుడ సేవకు ముందు జరుగుతున్న కారణంగా టీటీడీ ఒక పరిశీలనాత్మక గరుడ సేవను నిర్వహించింది.
Also Read:OTT:ఈ వారం ఓటీటీ సినిమాలివే!
ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవ గరుడ సేవలో వీలైనంత ఎక్కువ మంది భక్తులు వాహన సేవను తిలకించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వారిని ఆదేశించారు.
- Advertisement -

