వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డి టోకెన్లపై గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున SSD టోకెన్లపై టిటిడి ఈవో జె శ్యామలరావు, అదనపు ఇఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ మణికంఠ చందోలు, తదితర అధికారులతో కలిసి సమీక్షించారు.
తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు SSD టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉంది.జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న SSD టోకెన్లు జారీ చేయబడవు. వారు సర్వదర్శనం క్యూ లైన్‌లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయబడవు.అదేవిధంగా, జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఈ కారణంగా జనవరి 19న VIP బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. పైన పేర్కొన్న సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకుని టిటిడికి సహకరించాలని కోరడమైనది.
Also Read:రేవంత్ రెడ్డి..లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?:కేటీఆర్