TTD:శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ

3
- Advertisement -

తిరుమలలో శ్రీవారి వార్షిక పుష్పయాగానికి శుక్రవారం రాత్రి అంకురార్పణ శాస్త్రక్తంగా జరిగింది. శనివారం నాడు పుష్పయాగాన్ని పురస్కరించుకొని ముందు రోజున వసంత మండపంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Also Read:గురుకులాల్లో బర్త్ డే వేడుకలా?

- Advertisement -