TTD:పౌర్ణమి గరుడ సేవ

3
- Advertisement -

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యాల‌లో జ‌న‌వ‌రి 3న పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ గోవింద‌రాజ‌స్వామి, గరుడునిపై ఆల‌య మాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

Also Read:గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధం

 

- Advertisement -