TTD:క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి పవిత్రోత్సవాలు

49
- Advertisement -

శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివార్ల‌ను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ త‌రువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అంత‌కుముందు వైఖాన‌స ఆగమ స‌ల‌హాదారు శ్రీ మోహనరంగాచార్యులు, అర్చకులు శ్రీ నారాయణాచార్యుల చేతులమీదుగా ఆచార్య రుత్విక్‌వరణం కార్యక్రమం జ‌రిగింది.

అనంత‌రం సాయంత్రం స్వామి, అమ్మ‌వార్ల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట‌ నిర్వ‌హించ‌నున్నారు. పవిత్రోత్సవాల కారణంగా న‌వంబ‌రు 9 నుంచి 11వ తేదీ వరకు కల్యాణోత్సవం, న‌వంబ‌రు 9న తిరుప్పావ‌డ సేవ‌ ర‌ద్దయ్యాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

Also Read:కీలకమ్యచ్‌లో కివీస్ గెలుపు..

- Advertisement -