ఏఐ సాయంతో మూడు గంటల్లో దర్శనం!

1
- Advertisement -

తిరుపతి టీటీడీ 54వ టీటీడీ పాలకమండలి మొదటి సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని… ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో దర్శన భాగ్యం…అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతాం అన్నారు. విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తాం…. లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తాం అన్నారు.

శ్రీనివాస సేతు కు గరుడ వారధిగా పేరు మార్పు…20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేపట్టారు..ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. తిరుమలలో రాజకీయాలు ప్రసంగాలు నిషేధం, మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు..స్థానికులకు దర్శన భాగ్యం కల్పన…. ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తాం అన్నారు.

శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి…. వేరొక ట్రస్ట్ లో విలీనం చేస్తాం, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు… మెనూ లో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తాం…టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

శారదాపీఠంకు ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి… టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని..శాశ్వత ఉద్యోగులకు 17,400…. కాంట్రాక్టు ఉద్యోగులకు 7530 బ్రహ్మోత్సవ బహుమానం అన్నారు. టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు…. ఇందులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందన్నారు.

Also Read:కొడంగల్‌లో రేవంత్ సోదరుడి అరాచకాలు:ఈటెల

- Advertisement -