TTD:జూన్ నెల ఆన్‌లైన్ కోటా రిలీజ్!

16
- Advertisement -

శ్రీవారి సేవ స్వచ్చంద సేవ జూన్ నెల ఆన్‌లైన్ కోటాను ఏప్రిల్ 30న టీటీడీ విడుదల చేయనుంది. జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు, నవనీత సేవ (మహిళలకు మాత్రమే) – మధ్యాహ్నం 12:00 గంటలకు, పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) – మధ్యాహ్నం 1:00 గంటలకు, గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) – మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదలకానుంది.

శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమలులోకి రానున్నాయి.ఇకపై గ్రూప్ లీడర్స్‌గా సీనియర్ సేవకులు.. గత రెండు సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయస్సు 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారు నమోదు కావచ్చు.

Also Read:SSMB29..రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం, ప్రతి ఒక్క సేవకుని/సేవకురాలి పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.

- Advertisement -