బ్రహ్మోత్సవాలు…సీఎంకు ఆహ్వానం

5
- Advertisement -

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. చంద్రబాబును కలిసిన వారిలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఉన్నారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బీఆర్ నాయుడుతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు జరుగనున్నాయి.

సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడవాహనం, అక్టోబర్ 2న చక్రస్నానం జరుగనున్నాయి. ఇక ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి జ్యోతి, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ దర్శకుడు చందు మొండేటి.

Also Read:TTD:లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు

- Advertisement -