TTD:బ్రహ్మోత్సవాలు భక్తులకు ప్రత్యేక వైద్యసేవలు

6
- Advertisement -

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే తిరుమల, తిరుపతిలలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలలో భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది.

బ్రహ్మోత్సవాలలో లక్షలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అదనంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు,
రాంబగీచ అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము, శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయము, పాపానాశనం, 7వ మైలు వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకోసం టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ లు సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read:ఇండియా డే వేడుకల్లో టాక్ తెలంగాణం

- Advertisement -