శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగవారం రాత్రి ముత్యపు పందిరి వాహనసేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భరతనాట్యాన్ని ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సైదులు బృందం కోలాటంతో అలరించారు. తిరుపతికి చెందిన మురళీకృష్ణ బృందం రామరాజ్యం రూపకంతో అలరించారు. తిరుమల బాలాజీ నగర్ కు చెందిన డి.శ్రీనివాసులు బృందం కోలాటంతో అలరించారు.
తమిళనాడుకు చెందిన రాజ బృందం శ్రీ కృష్ణ వైభవాన్ని అత్యంత మనోహరంగా ప్రదర్శించారు. పాండిచ్చేరికి చెందిన విచిత్ర బృందం మోహిని యట్టం ప్రదర్శించారు. చెన్నైకి చెందిన సుమన ఆధ్వర్యంలో కరకట్టం అనే సంప్రదాయ జానపద నృత్యం , నామ రామాయణం రూపకాన్ని ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. చెన్నైకి చెందిన సెల్వం బృందం జానపద నృత్యం,
చెన్నైకి చెందిన విక్రమ్ ఆధ్వర్యంలో సంప్రదాయ కళల రూపకాన్ని ప్రదర్శించి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు.
తూర్పుగోదావరికి చెందిన జి.భవాని శిరీష బృందం మహిషాసుర మర్దిని రూపకాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు. పాండిచ్చేరికి చెందిన మాలతి బృందం రాధాకృష్ణ నృత్యంతో కనువిందు చేశారు. కర్ణాటక రాష్ట్రం, ఆవేరి జిల్లాకు చెందిన మంజునాథ్ బృందం రోస్టర్ డాన్స్ ను ప్రదర్శించారు. బెంగుళూరుకు చెందిన సతీష్ బృందం డొల్లు కునిత అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు. చెన్నైకి చెందిన లత బృందం నవశక్తి నృత్యాన్ని ప్రదర్శించి కనువిందు చేశారు.
Also Read:దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ సంచలన విజయం