శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ..

249
TTD Maha Samprokshanam Starts
- Advertisement -

లోకకళ్యాణం కోసం టీటీడీ 12 ఏళ్ళకోసారి నిర్వహించే అష్టభంధన, బాలాలయ, మహాసంప్రోక్షణ వైష్ణవ ఆగమ సాంప్రదాయానుసారంగా ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు అంగరంగవైభవంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీటీడీ. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో రుత్వీక వరణం కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచి రుత్వికులను ఆహ్వానించింది టీటీడీ.

44 మంది రుత్వికులు, 100 మంది వేదపండితులు, 20 మంది వేదపారాయణదారులు మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ కోసం శ్రీవారిఆలయంలో 18 వేదికలపై కుం భాలు, 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనం లేపనం తయారుచేశారు.

మహాసంప్రోక్షణ సందర్భంగా జయవిజయాలను దాటి గర్భాలయంలోకి ఆలయ అర్చకులు, జీయంగార్లు మినహా మరెవ్వరిని అనుమతించరు. గర్భాలయంలో మరమత్తులు కూడా ఆలయ అర్చకులే నిర్వహిస్తారు. శ్రీవారి మూలవర్లులలో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు.

మహాసంప్రోక్షణ దృష్ట్యా స్వామివారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దయ్యాయి.

- Advertisement -