TTD:శ్రీవారి నిత్య సేవలకు లక్కీ డిప్..

11
- Advertisement -

శ్రీవారి నిత్య సేవల లక్కీ డిప్(TTD Lucky dip tickets) రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు(TTD Devotees) ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లిస్తే వారికి టికెట్లు ఇవ్వనున్నారు.

అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు(Tirumala Information). వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జూలై నెల‌కు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్‌లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

శ్రీవారి లక్కీ డిప్ దర్శన టికెట్ల కోసం టీటీడీ అఫిషియల్ వెబ్ సైట్ https://www.tirumala.org ద్వారా చేసుకోవచ్చు.

Also Read:TTD:ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

- Advertisement -