TTD:మొబైల్ కంటైనర్లు

26
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుండగా శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కంటైనర్లను అందుబాటలోకి తెచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ అయినప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఒక కంటైనర్ ను జిఎన్సీ వద్దగల టీటీడీ ట్రాన్సుపోర్టు డిపోలో విధులు ముగించుకుని డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు కేటాయించారు. మరో కంటైనర్ ను రాంభగీచా -3 ఎదురుగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉందని, నూతన విశ్రాంతి గదుల నిర్మాణానికి అనుమతి లేదని చెప్పారు. పలుచోట్ల ఉన్న పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలో మొబైల్ కంటైనర్లను దాత అందించారని, ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు అని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read:సినీ స్టార్స్ పై పవన్ స్ట్రాటజీ?

- Advertisement -