హ్యాపీ బర్త్ డే…తిరుపతి లడ్డు!

48
- Advertisement -

తిరుమల వెంకన్నను లిప్త కాలంపాటు దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు స్వామి వారి ప్రసాదం లడ్డు కోసం క్యూలు కడుతుంటారు. ఎంతో అపురూపంగా కళ్లకు అద్దుకుని గోవిందా అంటూ స్వామివారి లడ్డూను ఆరగించే భక్తులు అంతటితో స్వామి దర్శనం పరిపూర్ణం అయిందని భావిస్తారు. తిరుమలకు వెళ్లి వచ్చామని అనగానే ఎవరైనా వారిని అడిగేది లడ్డూ ప్రసాదం తెచ్చారా అనే మాట. అందుకే లడ్డూలను భక్తులకు అందించడంలో తితిదే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. స్వామి వారికి ఏవిధమైన ప్రపంచ ఖ్యాతి ఉందో తిరుమల శ్రీవారి లడ్డూకు కూడా అదే స్థాయి ప్రాముఖ్యత ఉంది. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అందుకే తిరుపతి లడ్డు కి డిమాండ్ ఎంతో ఉంది.

తొలుత శ్రీవారి ప్రసాదాలను తిరుప్పొంగంగా పిలిచేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం మొదలైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 1950 నుంచి లడ్డూల్లో వాడే సరుకుల మోతాదును టిటిడి నిర్దేశించింది. ఈ లడ్డూలు తయారుచేయడానికి ఆవు నెయ్యి , శనగపిండి , చక్కెర ముంత మామిడిపప్పు ఎండుద్రాక్ష, కలకండ , ఏలకులను వినియోగిస్తారు.

Also Read:KTR:బీఆర్ఎస్..భారత ‘రైతు’ సమితి

శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్డూలు మూడురకాలుగా తయారు చేస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది.

ఇక అందరికీ అందుబాటులో ఉండే శ్రీవారి లడ్డూ 75 గ్రాముల బరువు ఉంటుంది. ఈ లడ్డూ తొలుత 8 అణాల నుంచి కాలక్రమేణా రూ. 2 ఇప్పుడు రూ. 25కి చేరింది. 2009 సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్ లభించింది. దీనితో టిటిడి మాత్రమే శ్రీవారి లడ్డూ తయారీ భాగ్యాన్ని దక్కించుకున్నట్లయింది.

Also Read:నేటి నుండి రైతు రుణమాఫీ..

- Advertisement -