TTD:రికార్డు స్థాయిలో ల‌డ్డూల విక్ర‌యం

5
- Advertisement -

2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించ‌బ‌డ్డాయి. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది 12.15 కోట్ల‌ ల‌డ్డూల‌ను విక్ర‌యించ‌గా ఈ ఏడాది 13.52 కోట్ల ల‌డ్డూల‌ను టీటీడీ భ‌క్తుల‌కు విక్ర‌యించింది. అంటే గ‌త ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల ల‌డ్డూల‌ను ఈ ఏడాది అద‌నంగా భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది.

గ‌త ద‌శాబ్ద‌కాలంలో ఎన్న‌డూ లేనివిధంగా 2025 డిసెంబ‌ర్ 27వ తేదిన అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం.

టీటీడీ గత సంవత్సరం గా ప్ర‌తిరోజూ 4 ల‌క్ష‌ల వరకూ ల‌డ్డూల‌ను త‌యారు చేస్తోంది. ముఖ్య‌మైన రోజుల్లో 8 ల‌క్ష‌ల నుండి 10 లక్షల ల‌డ్డూల వ‌ర‌కు(buffer)భక్తలకు అందుబాటులో ఉంచుతోంది.700 మంది శ్రీ‌వైష్ణ‌వ బ్ర‌హ్మ‌ణులు శ్రీ‌వారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంట‌లు శ్ర‌మిస్తూ నియ‌మ‌, నిష్ట‌ల‌తో స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను త‌యారు చేస్తారు.

Also Read:నితీశ్ కుమార్..ఆస్తులెంతో తెలుసా?

 

- Advertisement -