TTD: ముగిసిన జ్యేష్ఠాభిషేకం

18
- Advertisement -

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం క‌వ‌చాల‌ను ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత శతకలశ స్నపనం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు.

అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉత్స‌వ‌ర్ల‌ను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. క‌వ‌చ ప్ర‌తిష్ట‌, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వ‌హించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.

సాయంత్రం ఉభయనాంచారులతో కలసి స్వామివారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Also Read:నీట్ ప్రశ్నా పత్రాల లీకేజీపై సుప్రీం కీలక ఆదేశం

- Advertisement -