Tirumala:అత్యాధునిక తాళపత్ర స్కానర్

28
- Advertisement -

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక తాళపత్ర స్కానర్‌ను శుక్ర‌వారం టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవితో క‌లిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర తాళపత్ర పరిశోధన సంస్థ దేశంలోనే అతిగొప్ప సంస్థగా ఎదగాలని, టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. తాళపత్రాల్లో దాగి ఉన్న రహస్యాలను అందరికీ అందించాలని, ఇందుకోసం ఈ స్కానర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ దేశంలోనే ప్రసిద్ధ తాళపత్ర పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Also Read:విశాఖ నుంచి జగన్ పాలన కష్టమేనా?

ఈ కార్యక్రమంలో వ‌ర్సిటీ ఉప‌కులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, రిజిస్ట్రార్ డా. ఏ.వి.రాధేశ్యామ్‌, డీన్లు గోలి సుబ్రహ్మణ్య శర్మ, డా. ఫణియాజులు, తాళపత్ర విభాగాధిపతి విజయలక్ష్మి, పీఆర్వో డా. టి.బ్రహ్మాచార్యులు సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు.

Also Read:మంత్రి కేటీఆర్ ప్రసంగానికి అద్భుత స్పందన..

- Advertisement -