TTD:అంబేద్కర్‌ సిద్ధాంతాలు నిత్య స్ఫూర్తి

7
- Advertisement -

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్‌ సిద్ధాంతాలు భావి తరాలకు వెలుగులు నింపుతాయని టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మహతి ఆడిటోరియంలో బాబా సాహెబ్ 133వ జయంతి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ స్ఫూర్తికి ప్రతిరూపమన్నారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు.టీటీడీ చీఫ్ పిఆర్వో డాక్టర్ టి.రవి మాట్లాడుతూ ,డాక్టర్ అంబేద్కర్ కుల వివక్షను నిర్మూలించడం, విద్యను ప్రోత్సహించడం వంటి సామాజిక సంస్కరణ ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మరణించిన తర్వాత కూడా తన లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని వివరించారు.

Also Read:‘బహుముఖం’ మూవీ రివ్యూ..

- Advertisement -