TTD: శ్రీవారి ఆలయంపై ఈవో సమీక్ష

9
- Advertisement -

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం, చరిత్ర, వాస్తుశిల్పం, విశిష్టత మరియు అనేక ఇతర సంబంధిత విశేషాలపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు సవివరంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర, వైఖానస ఆగమ, జీయంగార్ వ్యవస్థ, వివిధ ఆచార వ్యవహారాలు, నిత్య, వార, మాస, వార్షిక సేవా కార్యక్రమాలు, సుప్రభాతం నుంచి ఏకాంతం వరకు ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామికి నిర్వహించే వివిధ కైంకర్యాలను సవివరంగా ఈవోకు వివరించారు.

తరువాత ఆయన ఉదయం సేవలు, విఐపి దర్శనం, సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, ఇతర దర్శనాలను కూడా సమీక్షించారు.భక్తులకు కల్పిస్తున్న వివిధ రకాల దర్శనాలు, ఇందుకు సంబంధించిన దర్శన సమయము, ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది తదితర అంశాలపై సవివరంగా తనకు నివేదిక పంపవలసిందిగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంను ఆయన ఆదేశించారు.

అంతకుముందు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నారాయణగిరి షెడ్లను ఈఓ పరిశీలించారు. యాత్రికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం గురించి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు.

Also Read:#NKR21..ఐపీఎస్‌గా వైజయంతి

- Advertisement -