TTD: తిరుమల తరహలో తిరుచానూరు ఆలయం అభివృద్ధి

4
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయం తరహలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు టీటీడీ ఈవో  జె.శ్యామలరావు వెల్లడించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈవో గురువారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆలయంలో ప్రస్తుతం ఉన్న ఐనామహల్, యాగశాల, పోటు, ప్రసాదాల పంపిణీ కౌంటర్ పరిశీలించారు.

ఆలయంలో ఉన్న ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్ ను ఆలయం బయటకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఈవో ఆలయం వెలుపల వున్న వాహన మండపం, ఆస్థాన మండపం క్రింద ఉన్న సెల్లార్, క్యూలైన్లు, పాత డిప్యూటీ ఈవో కార్యాలయం, ఆలయ నాలుగు మాడవీదులు, పద్మాసరోవరం పరిశీలించి పలు సూచనలు చేశారు.

Also Read:TTD:లక్కీడిప్‌లో శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు

- Advertisement -