శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

3
- Advertisement -

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. అక్టోబరు 8న గరుడసేవ రోజున అదనపు పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్‌ అధికారులను ఈవో ఆదేశించారు.

తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలు కలిపి దాదాపు 11000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయి. అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఈవో ఆదేశించారు.

అనంతరం ఇంజినీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్నప్రసాదాల పంపిణీ, సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగం అలంకరణలు, తగినన్ని లడ్డూల నిల్వ, ఉత్తమ కళా బృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై ఈవో సమీక్షించారు.

అంతకుముందు లడ్డూ కాంప్లెక్స్, పోటును సంబంధిత అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.ఈ తనిఖీల్లో భాగంగా లడ్డూ కౌంటర్లు, బూందీ పోటులను సందర్శించి లడ్డూల పంపిణీ, బూందీ తయారీ ప్రక్రియను పర్యవేక్షించి శ్రీవారి పోటుపై సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read:కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం..

- Advertisement -