టీటీడీ ఆస్తుల వివరాలివే..

234
ttd
- Advertisement -

టీటీడీ ఆస్తులపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో రూ.15,938 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించింది. మెచ్యూరిటీ పూర్తయిన డిపాజిట్లను అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టామని తెలియజేసింది.

గత మూడేళ్లలో స్వామివారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని తెలిపారు. 2019 జూన్‌ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 15,938 కోట్లకి డిపాజిట్లు చేరుకున్నాయని వెల్లడించింది. 2019 నాటికి బంగారం 7,339.74 కేజీలు ఉండగా ప్రస్తుతం 10.258.37 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.

టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుందన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది టీటీడీ పాలకమండలి. ఇక మరోవైపు స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.నిన్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.79 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు టీటీడీ అధికారులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -