TTD: శ్రీవారి భక్తులకు రుచికరమైన భోజనం

11
- Advertisement -

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.ఇందులో భాగంగా యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించి, టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.

భక్తుల సూచనల మేరకు వారికి అందిస్తున్న అన్నప్రసాదాలను మరింత రుచిగా అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.ఈవో వెంట డిప్యూటీ ఈవో (అన్న ప్రసాదం) రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Also Read:మాజీ మంత్రి డీఎస్ కన్నుమూత…

- Advertisement -