TTD:కర్ణాటకలో సత్రాల అభివృద్ధిపై రివ్యూ

8
- Advertisement -

తిరుమలలోని కర్ణాటక సత్రాల అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, కర్ణాటక రాష్ట్ర రవాణా, దేవాదాయ శాఖల మంత్రి రామలింగారెడ్డితో కలిసి బుధవారం అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేసేందుకు అవసరమైన డిజైన్లను సకాలంలో అందించాలని కర్ణాటక రాష్ట్ర అధికారులను టీటీడీ ఈవో కోరారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా టీటీడీకి అవసరమైన సమాచారం అందించాలని కర్ణాటక మంత్రి తమ ఎండోమెంట్ అధికారుల బృందాన్ని ఆదేశించారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తవుతాయని వివరించారు. కర్ణాటక స్టేట్ ఛారిటీస్ ప్రతినిధులు తమ డిజైన్లతో పాటు బ్లాక్ ఎ, బి భవనాలు, కల్యాణ మండపంలో గల గదుల వివరాలతో కూడిన ప్రణాళికను తెలియజేశారు.

Also Read:ట్రెండింగ్‌లో ‘టిల్లు స్క్వేర్’ సాంగ్

కర్ణాటక ప్రభుత్వం 2021 డిసెంబర్ 27న రూ.220 కోట్ల వ్యయంతో కర్ణాటక సత్రాల అభివృద్ధి కోసం తిరుమలలో గల స్థలాన్ని టీటీడీకి అప్పగించింది. ఈ భవనంలో మొత్తం 242 గదులతో రెండు బ్లాకులు, 12 డార్మిటరీలు, ఒక కల్యాణమండపం, ఒక సూట్ బ్లాక్, 86 గదులతో కూడిన పాత బ్లాక్ ఉన్నాయి.

Also Read:Jailer: ‘కావాలి’ సాంగ్

- Advertisement -