ఉచిత లడ్డు జారీ విధానంలో సైతం ఫోటో ఆధారిత బయోమెట్రిక్ ప్రవేశపెట్టాం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో ప్రవేశపెట్టిన ఫోటో ఆధారిత బయోమెట్రిక్ ప్రక్రియను పరిశీలించారు ధర్మారెడ్డి. మర్చి 1 తేదీ నుంచి తిరుమలలో ఫోటో ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసాం అన్నారు. గదుల కేటాయింపు సమయంలో ఫోటో క్యాప్చర్ తీసుకుంటున్నాం అన్నారు. గదులు కాళీ చేసే సమయంలో క్యాప్చర్ అయినా ఫోటో మ్యాచ్ అయితేనే కాషన్ డిపాజిట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
దీంతో దళారుల సంఖ్యా ఘననీయంగా తగ్గిందని…రూమ్ రొటేషన్ విధానం ఆగిపోవడంతో త్వరిత గతిన సామ్యామ్యా భక్తులకి గదులు త్వరగా అందించగలుగుతున్నాం అన్నారు. గతంలో దళారుల చేతివాటంతో గదుల రొటేషన్ విధానం సాగుతూ వచ్చేదన్నారు. ఫోటో ఆధారిత బయోమెట్రిక్ ద్వారా దళారులు గదులు పొందే అవకాశం లేదన్నారు. ఉచిత లడ్డు జారీ విధానంలో సైతం ఫోటో ఆధారిత బయోమెట్రిక్ ప్రవేశపెట్టాం అన్నారు.
లడ్డు మిస్యూస్ కాకుండా ఉండేదుకు ఈ విధానం తీసుకొచ్చామన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి…. ఈ విధానాన్నే కొనసాగేలా చేస్తాం అన్నారు. దీంతో దళారులను ఆశ్రయించే వీలు లేకుండా నేరుగా భక్తులే గదులు., లడ్డులను సులభతరంగా పొందవచ్చు అన్నారు.
ఇవి కూడా చదవండి..