TTD: అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు అందించండి 

6
- Advertisement -

శ్రీవారి సేవకులు అత్యంత క్రమశిక్షణ, అంకితభావం మరియు భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందించడమే కాకుండా యాత్రికులకు అందుతున్న వివిధ సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలని టీటీడీ అదనపు ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు.

తిరుమలలోని సేవాసదన్- 2లో బుధవారం సాయంత్రం జరిగిన సత్సంగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, శ్రీవారి సేవకులు స్వామివారి భక్తులకు సేవలందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాము సేవలందించే ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సదుపాయాలను గమనించి, వాటిపై అభిప్రాయ సేకరణను చేసి తమకు అందించి, తద్వారా వారికి అందుతున్న సౌకర్యాలు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవ రిజిస్ట్రేషన్‌తోపాటు, ఎలక్ట్రానిక్‌ డిప్‌ సిస్టమ్‌ ద్వారా ఆలయ విధుల కేటాయింపులు ఎంతో పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం శ్రీవారి సేవకులకు ఆయనే స్వయంగా ఈ-డిప్‌ విధానంలో ఆలయ డ్యూటీని విడుదల చేశారు. అంతకుముందు శ్రీవారి సేవకులు కొరకు భజన, ధ్యాన కార్యక్రమాలు జరిగాయి . అంతకుముందు అక్టోబరు 4న వార్షిక బ్రహ్మోత్సవాల తొలిరోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన దృష్ట్యా శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం, పాంచజన్యం, తదితర ప్రాంతాలను అదనపు ఈవో సంబంధిత అధికారులతో కూడి పరిశీలించారు.

Also Read:KTR : దేవర ప్రీ రిలీజ్ రద్దుపై కేటీఆర్

- Advertisement -