టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గంటలలో స్వామివారి దర్శనం అయ్యేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీపై పాలకమండలి సభ్యులకు బెంగళూరుకు చెందిన సీట్రూ అండ్ ఏషియా అనే కంపెనీ టీటీడీ చైర్మన్ కార్యాలయంలో డెమో ఇచ్చారు.
తొలిగా కియోస్కూలో ఫేస్‌తో టోకెన్ జారీ, ఫేషియల్ రికగ్నేషన్, బారియర్ గేట్ వద్ద నిలబడితే గేటు తెర్చుకోవడం తదితర అంశాలపై వివరణ ఇచ్చారు. ఏఐ ద్వారా రెండు గంటలలో స్వామివారి దర్శనం చేసుకోవడంపై గత ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు.
శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. గత టిటిడి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవలసి ఉంటుంది.
Also Read:ఉస్తాద్ …జాకీర్ హుస్సేన్