TTD:చంద్రగ్రహణం..దర్శనానికి బ్రేక్

5
- Advertisement -

చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమల దర్శనానికి బ్రేక్ ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7 సా.3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకూ శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు.

సెప్టెంబర్ 8వ తేదీన సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం చేయనున్నారు. అనంతరం ఏకాంతంగా తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6 గంటలకు భక్తులకు శ్రీవారి దర్శనం పునః ప్రారంభం కానుంది. చంద్ర గ్రహణం సందర్భంగా సెప్టంబ‌ర్ 7న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read:పంచాయతీ ఎన్నికలపై అప్‌డేట్

- Advertisement -