TTD:భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన భూమన

14
- Advertisement -

అలిపిరి నుండి నడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సోమవారం రాత్రి గాలిగోపురం వద్ద పరిశీలించారు. భక్తులను గుంపులుగా ఏర్పాటుచేసి ముందు, వెనుక సెక్యూరిటీ సిబ్బంది వారిని నరసింహ స్వామి ఆలయం వరకు తీసుకుని వెళుతున్న విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు.

విజిలెన్స్ , గూర్ఖా, సెక్యూరిటీ సిబ్బందితో చైర్మన్ మాట్లాడారు, భక్తులను నిరంతరం అప్రమత్తం చేస్తూ ఉండాలని ఆదేశించారు. నడచి వెళుతున్న భక్తులతోను, అక్కడి దుకాణ దారులతోను కరుణాకర రెడ్డి మాట్లాడారు.

అలిపిరి నుండి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుండి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరిస్తేనే 12 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు , కాఫీ , టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Also Read:కోమటిరెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్…

- Advertisement -