TTD: శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం రద్దు

11
- Advertisement -

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవమును టీటీడీ రద్దు చేసింది.ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ జ‌రుగ‌నున్న వరలక్ష్మీ వ్రతం కరపత్రాలను సోమవారం టీటీడీ ఈవో  జె.శ్యామలరావు ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరులోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం జ‌రుగ‌నుంద‌న్నారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు   పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

Also Read:కన్నప్ప.. ‘చండుడు’ కారెక్టర్ లుక్

- Advertisement -