తిరుమల కొండపై ప్రైవేట్ హోటల్స్ తొలగింపు..

105
yv subbareddy
- Advertisement -

తిరుమల కొండపైకి వచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొండపై ఉన్న ప్రైవేట్ హోటల్స్ అన్ని తొలగించనున్నారు. టీటీడీ బోర్డు వివరాలను వెల్లడించిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…కరోనా కారణంగా రెండు సంవత్సరాల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.

కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించాలని నిర్ణయించిన టీటీడీ బోర్డు…అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో 50 ఎకరాల్లో ఆధ్మాత్మిక నగరం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మహాద్వారం, బంగారు వాకిలి, ఆనందనిలయానికి బంగారు తాపడం చేయించాలని… రూ. 230 కోట్లతో పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 2.73 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునీకరణ…. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలకు రూ.25 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.

- Advertisement -