టీటీడీ ఉద్యోగులు వెనక్కి తగ్గారు. ఉద్యోగి బాలాజీ సింగ్ కు క్షమాపణ చెప్పారు బోర్డు సభ్యుడు నరేష్. ఇది మా కుటుంబ సమస్య…. అందరూ కలసి చర్చించుకున్నాం.. ఈ సమస్యను కలసికట్టుగా మాట్లాడుకుని పరిష్కరించుకున్నాం అన్నారు. దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేలా కృషి చేస్తాం అని టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ తెలిపారేఉ.
నా డ్యూటీ అయిపోయిన సమయంలో బోర్డు సభ్యులు నరేష్ నన్ను దూషించారు టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ .నాకు చాలా బాధ వేసిందన్నారు. బోర్డు సభ్యుడు నరేష్ నన్ను క్షమాపణ కోరారు ,గేటు తెరిచిన నన్ను దూషించడం చాలా బాధ వేసింది.. ఉద్యోగ సంఘాలు పాలకమండలి సభ్యులతో, అధికారులతో చర్చలు జరుపుతున్నారు అన్నారు.
బాలాజీ పట్ల తాను బాధ్యత రహితంగా వ్యవహరించానని నరేష్ కుమార్ పశ్చాత్తాప పడ్డారు. భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.. క్షణికావేశంలో చేసిన తప్పు…. ఆయన కుటుంబ సభ్యులు సైతం పశ్చాత్తాప పడ్డారు.. సంస్థ ప్రతిష్ట కాపాడే విధంగా అందరూ కృషి చేస్తాం అని మరో బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు.
Also Read:అటెండర్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్గా!

