TTD: మాడ వీధుల్లో అదనపు ఈవో తనిఖీ

10
- Advertisement -

తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగనున్న నేపథ్యంలో, నాలుగు మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ మరియు నిష్క్రమణ, హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన, గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు అదనపు ఈవోకు వివరించారు.

Also Read:KTR: దళిత మహిళపై ఇంత దాష్టీకమా?

- Advertisement -