మొక్క‌లు నాటిన టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌..

265
Uppala Srinivas Gupta
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ‌జ్వేల్‌లోని హ‌రిత హోట‌ల్ ప్రాంగ‌ణంలో తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త మొక్క‌లు నాటారు. మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్‌.సి రాజ‌మౌలి గుప్త‌, కౌన్సిల‌ర్ల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా శ్రీ‌నివాస్ గుప్త‌తో పాటు వారంతా మొక్క‌లు నాటారు. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌టినుంచే ప‌చ్చ‌దాన్ని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శ్రీ‌నివాస్ గుప్త అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని హరిత హోటల్స్ లో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.

పుస్తకాల్లో చదివిన అశోక చక్రవర్తిలా సీఎం కేసీఆర్ చరిత్రకెక్కారన్నారు. దశాబ్దాల వరకు ఆక్సిజన్‌కు ఇబ్బందులు లేకుండా కోట్లాది మొక్కలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాటడం జరిగిందన్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన స్పూర్తితో మొక్కలు నాటుతున్నారన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ జ‌క్కీయోద్దీన్, కౌన్సిల‌ర్లు మెట్ట‌య్య‌, చందు, హరిత హోటల్ డి.ఈ నటరాజ్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, వైశ్య నాయ‌కులు సంతోష్ గుప్త, కనకయ్య, సంపత్, శేఖర్, ప్రవీణ్, భిక్షపతి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -