KTR:ప్రభుత్వంలో TSRTC విలీనం

60
- Advertisement -

10 జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..గవర్నమెంట్‌లో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బిల్లు అమోదం పొందిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులగా మారనున్నారని తెలిపారు. ఆగస్టు 3 నుండి ప్రారంభమయ్యే సమావేశాల్లో బిల్లు అమోదం పొందనుందని తెలిపారు. 43 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని చెప్పారు.

రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని నిర్ణయించామన్నారు. వరదలు సంభవించిన ప్రాంతాల నుండి 27 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని..వారిని త్వరలోనే వారి స్వస్థలాలకు చేరుస్తామన్నారు.వెంటనే విత్తనాల సరఫరాను ప్రారంభిస్తామన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ రూ.60 వేల కోట్లతో మెట్రో ప్రాజెక్టు చేపడతామన్నారు.

Also Read:రాజమౌళి – మహేష్‌..మల్టీస్టారర్‌ మూవీనా!

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కొర్ర సత్యనారాయణ,దాసోజు శ్రావణ్ ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

- Advertisement -