ద‌స‌రా ర‌ద్దీ .. ప్ర‌త్యేక బ‌స్సులు

620
dasara rush
- Advertisement -

దసరా పండుగ సందర్బంగా ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది టీఎస్‌ ఆర్టీసీ.హైదరాబాద్ నుంచి 31 జిల్లా కేంద్రాలు,ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపనున్నామని అధికారులు తెలిపారు.

ఎంజీబీఎస్‌, జేజీఎస్‌తో పాటు దిల్‌సుఖ్‌నగర్‌, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్‌, ఎస్‌ ఆర్‌ నగర్‌, ఉప్పల్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.  ఇందుకోసం 4,480 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనుండగా ఆన్‌లైన్‌లో టికెట్ల రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈనెల 8వ తేదీ నుండి ప్రారంభమైన బస్సులు 18వ తేదీ వరకు నడవనున్నాయి.

దసరా పండుగకు నెల రోజుల ముందు నుండే వివిధ జిల్లాల డిపో మేనేజర్లు, కార్మిక నాయకులతో సమావేశాలు నిర్వహించారు అధికారులు. సంస్థకు ఆదాయం తీసుకురావడంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు . మరోవైపు ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రయాణీకుల జేబు గుల్లా చేస్తుండటంతో తక్కువ ఖర్చు,సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -