మేడారం జాతరకు 4వేల బస్సులు

472
- Advertisement -

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ వన దేవతల జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక జాతరకు తరలివచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి 4000వేల బస్సులను నడపనున్నట్లు తెలిపారు ఆర్టీసీ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈ యాదగిరి తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాదికారులు వరంగల్‌ రీజియన్‌ అధికారులతో కలిసి ములుగు జిల్లా మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్‌స్టేషన్‌ అలైటింగ్‌, బోర్డింగ్‌, టికెట్‌క్యూలైన్‌, భక్తుల వసతుల పనులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ వచ్చే నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న మేడారం జాతరకు వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజినల్‌ నుంచి నాలుగు వేల బస్సులను నడుపనున్నట్లు చెప్పారు .

గత జాతరకు 3500 బస్సులతో 18 లక్షల మంది భక్తులను జాతరకు చేరవేశామని, ఈ సారి నాలుగు వేల బస్సులతో సుమారు 23 లక్షల మంది భక్తులను చేరవేసేందుకు ఏర్పాట్లు చేశామని ఈడీవో పేర్కొన్నారు. ఈ జాతరకు సంబంధించి ఆర్టీసీ నుంచి ఈసారి మొత్తం 12500మంది ఉద్యోగులు విధుల్లో ఉంటారని చెప్పారు. మేడారం బస్‌స్టేషన్‌ వద్ద సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిడి గిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దెకు చేరుతుంది. 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

- Advertisement -