టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్..

82
tsrtc
- Advertisement -

ప్రజలకు చేరువయ్యేందుకు టీఎస్‌ఆర్టీసీ వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తోంది. ఇందుకోసం తాజాగా మరో ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 15న జన్మించిన చిన్నారులకు 12 ఏళ్లు వచ్చేంత వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది.

అలాగే తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో చికిత్స కోసం వెళ్లి తిరిగి ఇళ్లకు వెళ్లే వారికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఇక మీదట కూడా కొనసాగించాలని నిర్ణయించింది. దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ వచ్చిన వారు కూడా రెండుగంటలపాటు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.

అనారోగ్యంతో బాధపడుతూ.. ఆర్టీసీ హాస్పిటల్‌లో చూపించుకున్న వారు టికెట్ లేకుండానే ఇంటికి వెళ్లొచ్చు. అయితే రెండు గంటలపాటు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం హాస్పిటల్‌ డాక్టర్లు.. మందుల చిటీపై పేషెంట్ తమను కలిసి టైంను పేర్కొంటారు. బస్సు ఎక్కిన తర్వాత దాన్ని కండక్టర్‌కు చూపిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో టికెట్ తీసుకోకుండా ఉచితంగా ప్రయాణించొచ్చు.

- Advertisement -