రాజ్‌భవన్‌ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు

46
- Advertisement -

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ తమిళిసై అమోదానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ ఈ బిల్లును అమోదించలేదు.

దీంతో ఆర్టీసీ కార్మికులు భగ్గుమన్నారు. రాజ్ భవన్ ముట్టడించేందుకు నెక్లెస్ రోడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నారు. గవర్నర్ వెంటనే బిల్లును అమోదించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

గవర్నర్‌ తమిళసై తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా విజయవంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు. దీంతోబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

Also Read:నంది అవార్డు వేడుకతో సంబంధం లేదు..!

- Advertisement -