తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ శుభవార్త తెలిపింది. త్వరలోనే గ్రూప్-2,3 నోటీఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 50వేల వరకు పోస్టుల భర్తీకి నోటీపికేషన్లు ప్రకటించింది. కాగా త్వరలో మరో 30వేల పోస్టులుకు కూడా అర్థిక శాఖ అమోదం తెలపనుంది. కాగా తాజాగా గ్రూప్-2 కింద పోస్టులు 663, గ్రూప్-3 కింద 1373 పోస్టులు భర్తీ కానున్నాయి. దీంతో పోస్టుల భర్తీపై కసరత్తు ప్రారంభించింది టీఎస్‌పీఎస్సీ.
హైదరాబాద్‌లోని నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల హెచ్‌వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 100మంది అధికారులు తమ శాఖల పరిధిలోని ఖాళీలు, సమస్యలు, తదితర అంశాలపై చర్చించారు. సర్వీస్ రూల్స్, సవరణలు, క్లారీఫికేషన్లు, రోస్టర్ విధానం, పార్వర్ఢ్ ఖాళీలు, అర్హతలు తదితర విషయాలపై చర్చించారు. ఈ తర్వాత వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ…త్వరితగతిన గ్రూప్-2,3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివిధ లీగల్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమన్నారు. వీలైనంత త్వరగా ఆయాశాఖల అధికారులు పూర్తి ఇండెంట్లు టీఎస్పీఎస్సీకి సమర్పించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.