మళ్లీ టీఆర్‌టీ ద్వారా రిక్రూట్‌మెంట్‌…

216
techer
- Advertisement -

తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది అసెంబ్లీలో ప్రకటించగా అప్పటినుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తూనే ఉంది. కేవలం ఐదు నెలల్లోనే 52,460 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా నియామక సంస్థలు ఇప్పటికే 19,359 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత నెల 30న గ్రూప్‌-2,3 ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా తాజాగా ఉపాద్యాయ ఉద్యోగాలు కూడా త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనుంది.

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టీచర్‌ పోస్టులను టీఎస్పీఎస్సీ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇదే అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు పలుమార్లు పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 10,500 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించారు. ఆర్ధిక శాఖ ఆమోదం లభించగానే పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఉన్నత విద్యాశాఖలో కూడా నోటిఫికేషన్‌లు విడుదల చేయనున్నారు. కాలేజీ, డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో మొత్తంగా సుమారుగా 70వేల ఉద్యోగాలను త్వరలో పూర్తి చేయనున్నారు.

 

 

- Advertisement -