టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌…833పోస్టులు

59
tspsc
- Advertisement -

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువ‌డింది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటనను జారీ చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌, ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 21వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించాలని సూచించింది.

రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ చకచకా సాగుతున్నది. ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ ప్రకటించగా కేవలం ఐదు నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 52,460 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 20,899 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఇటీవ‌లే మ‌హిళా శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు 23 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ వెలువ‌డ‌గా, తాజాగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్‌సీస్(175) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

- Advertisement -