మొక్కలు నాటిన సుమిత్రానంద్ ఫ్యామిలీ..

47
- Advertisement -

రాజ్యసభ సభ్యులు పర్యావరణవేత్త గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు హరితబంధు జోగినపల్లి సంతోష్ కుమార్ హరిత ఉద్యమ స్పూర్తి తో మొక్కలు నాటారు మహతి. తెలంగాణరాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు సుమిత్రానంద్ తానోబ ఆనంద్ రావు దంపతుల కుమార్తె మహతి తన 12 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మూడు మొక్కలు నాటారు.

కొంపల్లి లోని తన ఇంటి ఆవరణ లో రామసితాఫలం, వాటర్ యాపిల్ , యాపిల్ మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమం లో తాను కూడా పాలుపంచుకుంది.తన తరగతి లోని తన తోటి విద్యార్థులకు మొక్కల పెంపకం అవశ్యకతను ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలను వివరిస్తానని మహతి ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read:‘దయా’ థ్రిల్‌కు గురి చేస్తుంది: రమ్య నంబీషన్

- Advertisement -