తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురునందించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీఎస్‌పీఎస్సీ 2786 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చెయ్యాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారు అందులో భాగంగా ఖాళీగా ఉన్న గ్రూప్ 4, వీఆర్‌వో, ఏఎస్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం 2,786 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగ నియామక చేపట్టనుంది.
ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నెల 7 నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 7న పరీక్ష నిర్వహణ. ఏఎస్‌వో పోస్టులకు ఈ నెల 8 నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్ 2న పరీక్ష. అదేవిధంగా వీఆర్‌వో పోస్టులకు ఈ నెల 8 నుంచి జూలై 2 వరకు దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్ 16న రాత పరీక్ష నిర్వహణ.
ఈ ఏడాది అక్టోబర్ 7వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖలోని 700 వీఆర్వో ఖాళీలకు దరఖాస్తులను ఈ నెల 8వ తేదీనుంచి జూలై 2వ తేదీవరకు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16వ తేదీన పరీక్ష ఉంటుంది. టీఎస్‌ఆర్టీసీలో 33 జూనియర్ అసిస్టెంట్ (పర్సనెల్), 39 జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) ఉద్యోగాల భర్తీకి సైతం ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
అక్టోబర్ 7వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ సబార్డినేట్ సర్వీస్‌లోని 474 మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కొలువులకు ఈ నెల 8వ తేదీన దరఖాస్తుల స్వీకరణ మొదలై వచ్చేనెల 2వ తేదీకి ముగియనుంది. సెప్టెంబర్ 2న పరీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ, హోం శాఖలోగల 19 స్టెనో పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11వ తేదీన మొదలై జూలై 2న ముగుస్తుంది. ఈ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.