గ్రూప్-3లో 1365పోస్టుల భర్తీ

97
- Advertisement -

తెలంగాణలో కొలువుల జాతరలో భాగంగా గ్రూప్-3 నోటిఫికేషన్‌ టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. నిన్న గ్రూప్-2నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా నేడు గ్రూప్-3 లో భాగంగా 1365పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యుర్థులు జనవరి 24నుంచి ఫిబ్రవరి23వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరాఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే గ్రూప్‌-1,2,4 విడుదల చేసింది. గ్రూప్-1ప్రాథమిక పరీక్ష ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. హాస్ట‌ల్ వార్డెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. హార్టిక‌ల్చ‌ర్, వెట‌ర్న‌రీ శాఖ‌ల్లో కూడా కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. పోలీస్ నర్సింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసందే. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

ఇవి కూడా చదవండి…

5204పోస్టుల స్టాఫ్ నర్సింగ్ నోటిఫికేషన్‌

జనవరి 1…నూమాయిష్ ఎగ్జిబిషన్‌

2022… గూగుల్ శోధించిన వ్యక్తులు

 

- Advertisement -