త్వరలో ఉద్యోగ సమాచారం మ్యాగజైన్‌ని ప్రారంభించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ మూడో వార్షికోత్సవం సందర్భంగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఘంటా త్వరలో పోటీ పరీక్షల ఫలితాలన్ని విడుదల చేస్తామన్నారు.
పారదర్శకతతో టీఎస్‌పీఎస్సీని దేశంలోనే ఆదర్శంగా నిలిపామన్నారు. టీఎస్‌పీఎస్సీలో కంప్యూటరైజేషన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు 98 నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ మూడో వార్షికోత్సవం సందర్భంగా మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లతో ఇప్పటివరకు 100 నోటిఫికేషన్లను విడుదల చేసింది. 2018లో మరిన్ని కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ఆన్ లైన్ జర్నల్‌ని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు.
అవినీతికి తావు లేకుండా సామాన్యులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీఎస్‌పీఎస్సీకే దక్కిందని అల్లం నారాయణ అన్నారు .గతంలో ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు పలుకుబడి ఉన్నవాళ్లకే ఉద్యోగాలు దక్కాయని కానీ నేడు స్వరాష్ట్రంలో ఆ పరిస్ధితి మారిందన్నారు.