ఫిజిక‌ల్ ఈవెంట్స్…గర్భిణులకు మినహాయింపు

56
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో వేలాది కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ప్రీలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ పిజికల్ ఈవెంట్స్‌ నుంచి గర్భిణులకు మినహాయింపు ఇచ్చారు. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారిలో పలువురు మహిళలు గర్భిణులుగా ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరు కాలేకపోతున్నారు. దీంతో ఈ ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనకుండానే మెయిన్స్‌ రాసేలా వెసులుబాటు కల్పించారు. అయితే కోర్టు ఆర్డర్ ప్రకారం గర్భిణులు మెయిన్స్‌ పాసైతే నెల రోజుల్లోపు ఫిజికల్‌ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికారుల నియమావళిని అంగీకరిస్తూ గర్భిణులు లేఖ రాసివ్వాలని నిబంధన విధించారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన వ్యాపారవేత్త రాజేశ్వర్‌

పచ్చి గుడ్డు తింటున్నారా.. జాగ్రత్త!

మొక్కలు నాటిన షాబాద్‌ జెడ్పీటీసీ…

 

- Advertisement -