తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ నియామక మండలి వైబ్‌సైట్‌లో కానిస్టేబుల్ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 17156 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళలు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఫలితాలను వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా చూసుకోవచ్చని సెలక్షన్ బోర్డు ప్రకటించింది.
కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక జాబితాలపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే అక్టోబరు 1న సాయంత్రం 5 గంటలలోపు తమ అభ్యంతరాలను తెలపవచ్చు. ఇందుకు గాను అభ్యర్థులు రూ.2000 సర్వీసు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. మరిన్ని వివరాలకు https://www. tslprb.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
తెలంగాణలో మొత్తం 17,156 పోస్టుల్లో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 16,925 కాగా.. టెక్నికల్ కానిస్టేబుల్ పోస్టులు 231 ఉన్నాయి. తుది ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పోలీసు నియామక బోర్డు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసి ఫలితాలను విడుదల చేశారు.
ఎంపికైన అభ్యర్థులు-17,156
పురుషులు- 13,373
మహిళలు- 2,652