తెలంగాణలో భద్రతకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్…ఖాళీగా ఉన్న ఎస్‌ఐ పోలీసు కానిస్టేబుల్ నియమాకాలకు నోటీఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఎస్ఐ పోలీసు కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో 84.06శాతం మంది అర్హత సాధించినట్టు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి తుది రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌లో నేటి రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
Also Read: KCR:కులవృత్తులకు అండగా ఉంటాం
అభ్యర్థులకు రీకౌంటింగ్ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు ఇతర కమ్యూనీటిలు నాన్ లోకల్ అభ్యర్థులు రూ.3వేలు చెల్లించి రీకౌంటింగ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియ జూన్ 1వ తేదీ ఉదయం 8గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మొత్తంగా 98218మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ అభ్యర్థులు 43708మంది, ఐటీ అండ్ సీవో 4564, ఎస్ఐ ఐటీ అండ్ సీవో 729, పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్ డ్రైవర్ ఆపరేటర్ 1779మంది, ఏఎస్‌ఐ ఎఫ్ పీబీ 1153మంది, పీటీవో 463మంది పీసీ మెకానిక్ 238మంది అర్హత సాధించారు.
Also Read: KTR:దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం