ముగిసిన ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్‌..

33
- Advertisement -

తెలంగాణ పోలీసుల నియామక బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌ ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఫిజికల్ టెస్ట్‌లో మొత్తం 1,11,209 మంది ఆర్హత సాధించారని టీఎస్‌ఎల్‌ఆర్బీ వెల్లడించింది. కాగా ఈ పరీక్షకు మొత్తం 2,07,106మంది హాజరయ్యారని అందులో 1,11,209మంది మాత్రమే అర్హత సాధించారని తెలిపింది. వీరిలో పురుషులు 83,449 మంది, 27,760మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 12కేంద్రాల్లో ఫిజికల్‌ ఈవెంట్స్ జరిగాయని, ఈనెల 5తో ముగిశాయని ప్రకటించారు. తుదీ పరీక్షకు అర్హత సాధించిన వారు 53.70శాతంగా ఉన్నారు. గతంలో(2018-19) నిర్వహించిన ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లో 48.52శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. వచ్చే మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 23 వరకు పోలీస్‌ ఉద్యోగాలకు తుది పరీక్షలు జరుగుతాయని…అభ్యర్థులు వారం రోజులు ముందుగా హల్‌టికెట్‌లు తీసుకోవాలని సూచించింది. ఈ ఎగ్జామ్స్‌ ద్వారా 17,516మంది ఉద్యోగులను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించడంతో టీఎస్‌ఎల్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

సుడాన్‌కు యూఎన్‌ పీస్‌…

ఖరీదైన పిల్లిగా…స్కాటిష్‌ ఫోల్డ్‌ ఒలివియా

తిరిగిరాని సంప్రదాయం..

- Advertisement -